మన్యం న్యూస్ చండ్రుగొండ,ఏప్రిల్ 18: అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక రైతువేదిక నందు జరిగిన కార్యక్రమంలో ముస్లీంలకు రంజాన్, తోఫాలను, కళ్యాణలక్ష్మి చెక్కులు 12 మందికి లబ్దిదారులకు ఎమ్మేల్యే అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. ప్రజలకు సేవ చేయటమే నిజమైనా గుర్తింపు అని, ప్రజా సేవలో నిత్యం ఉండటమే తనకు ఇష్టమన్నారు. అన్నివర్గాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని, రైతుభీమా, రైతుబంధు,దళితబంధు పథకాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. అన్ని పండుగలను పేదలు ఘణంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో సిఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వర్సా రవికుమార్, ఎంపిడిఓ అన్నపూర్ణ, ఎంపీపీ బానోత్ పార్వతి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, జెడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి, ఎంపిటీసీలు దారా వెంకటేశ్వరరావు, లంకా విజయలక్ష్మి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, సర్పంచ్లు బానోత్ రన్య, బానోత్ కుమారి, గుంపెన సోసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, బిఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు దారా బాబు, ఉప్పతల ఏడుకొండలు, సీనియర్ నాయకులు మేడా మోహన్ రావు, భూపతి రమేష్, జడ వెంకయ్య, గుగులోత్ శ్రీనివాస్నాయక్, బానోత్ బీలు, గుగులోత్ రమేష్, కళ్లేం వెంకటేశ్వర్లు, మసీద్ కమిటీల బాద్యులు షమీ, రవూప్, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.