మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి ఏప్రిల్ 18: మండల కేంద్రంలోని వివోఏల సమ్మెకు మద్దతుగా మంగళవారం సీఐటియు ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు చల్లా పుల్లయ్య మాట్లాడుతూ వివోఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి,వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని,ప్రతి నెల తప్పనిసరిగా వారికి వారి వ్యక్తిగత అకౌంట్లలో వేతనం వెయ్యాలని డిమాండ్ చేశారు.అర్హులైన వివోఏ లను సీసీ లుగా గుర్తించాలని,వారితో ఆన్లైన్ పనులను చేయించకూడదని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరీశిలించి తక్షణమే వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.లేకపోతే ఈ సమ్మెను మరింత ఉదృతం చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు వనమా గాంధీ,ఇనుపనూరి జమలయ్య,గోళ్ళ ముత్తయ్య,భూక్యా చెన్నారావు,దారావత్ మల్లేష్,వివోఏ తదితరులు పాల్గొన్నారు.