మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 18, ముస్లింల పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏట అందిస్తున్న రంజాన్ పండుగ (తౌఫా) కానుకను మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయము నందు తహశీల్దార్ ఆర్ శారద, ఎంపీపీ సోనీ, సర్పంచ్ విజయ, ఎంపీటీసీ రాజశేఖర్ లు ముస్లిం మహిళలకు అందజేశారు. మండల వ్యాప్తంగా 180 మందికి రంజాన్ పండుగ కానుకను అందజేస్తున్నట్లు జామా మజీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ సిద్ధిక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ కిషోర్, రెవిన్యూ ఇన్ స్పెక్టర్ తిరుపతిరావు, జామా మజీద్ కమిటీ సభ్యులు జానీ మియా, షేక్ బాబు, షేక్ బాలాజీ, మస్తాన్, షేక్ సుభాని, మహబూబ్, కరీం, యూసుఫ్, షఫీ ముస్లిం మహిళలు తదితరులు పాల్గొన్నారు