మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ముస్లింలు పరమ పవిత్రంగా భావించే పండుగ రంజాన్. ఈ సందర్భంగా రంజాన్ పర్వదినాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచన మేరకు ఇల్లందు పురపాలక సంఘం సన్నద్ధం అయింది. రంజాన్ పర్వదినం నాడు ముస్లిం సోదరులు ప్రార్థన నిర్వహించే బైపాస్ రోడ్డు జెకె ఈద్గాలను మంగళవారం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏ విధమైన లోటుపాట్లు దొర్లకుండా అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంట నాలుగో వార్డ్ కౌన్సిలర్ సయ్యద్ ఆజం, కో ఆప్షన్ సభ్యులు రబ్బు, బారాస నాయకులు ఎర్ర ఈశ్వర్, బారాసా పట్టణ యువజన అధ్యక్షులు మెరుగు కార్తీక్, నాయకులు అక్కపల్లి సతీష్, కనకమహాలక్ష్మీ డెకరేషన్ యజమాని కృష్ణ, జవాన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.