మన్యం న్యూస్, పినపాక:
యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పినపాక మండలంలో ప్రారంభమయ్యాయి. మండల పరిధిలోని గోపాలరావుపేట గ్రామంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాసంగి పండించిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్ద విక్రయించికోవచ్చు అని తెలియజేశారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ మాట్లాడుతూ, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, బొలిశెట్టి నరసింహారావు, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, సీఈవో కొంపల్లి సునీల్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.