UPDATES  

 భూమి కోల్పోయిన మాకు న్యాయం చేయండి..        

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కరకట్ట నిర్మాణం పేరుతో తాతల తండ్రుల కాలం నుండి వ్యవసయ మా భూమిని ప్రభుత్వం భూ సేకరణలో తీసుకోగా ఈ భూమికి సంబంధించిన నష్టపరిహారం మాత్రం సర్వే అధికారులు స్థానిక కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈ భూమికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తికి నష్టపరిహారం ముట్ట చెప్పారని ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోతున్న భూమికి అసలు యజమానునైనా మాకు పరిహారం చెల్లించాలని  పర్ణశాల గ్రామపంచాయతీ పెరాయిగూడెం గ్రామానికి చెందిన వాగే చలపతి అనే ఆదివాసి గిరిజనుడు తన కుటుంబ సభ్యులతో కరకట్ట నిర్మాణంలో కోల్పోతున్న భూమి వద్ద గుడిసె వేసి బుధవారం దీక్ష చేపట్టారు నాకు చెందాల్సిన నసపరిహారం డబ్బులు 45 లక్షల రూపాయలు అమాయక గిరిజనులమైన మా కుటుంబాన్ని మోసం చేసి పి రాయి గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కాజేశాడని గత సంవత్సరం నర కాలం నుండి అధికారులకు దరఖాస్తులు పెడుతూ కాళ్లు అరిగేలా తిరిగినా తనకు న్యాయం జరగలేదని అన్నారు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మేరకు స్థానిక అధికారులు మూడుసార్లు ప్రాజెక్టులో పోతున్న నా భూమిని పరిశీలించి ఏ గట్టు రైతుల వాంగ్మూలం కూడా తీసుకొని ఇంతవరకు నాకు న్యాయం చేయట్లేదని బాధ్యత రైతు చలపతి వాపోయాడు జిల్లా కలెక్టర్ వద్దకి వెళ్లిన న్యాయం జరగకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు ఇదంతా చూస్తుంటే భారీ స్థాయిలో కొందరి అధికారులకు ముడుపులు అందినట్లు అనుమానం కలుగుతుందని ఇప్పటికైనా అధికారులు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నా కుటుంబానికి చెందాల్సిన నష్టపరిహారం డబ్బులు కాజేసిన వ్యక్తి నుండి తిరిగి ఇప్పించి తనకు న్యాయం చేయాలని లేదంటే కుటుంబానికి పురుగులు మందే శరణ్యమని తెలిపారు ఈ దీక్ష శిబిరంలో బాధిత రైతు వాగే చలపతి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !