మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాక ముందు పండుగలకు కానుకలు లేవు, ఇఫ్తార్ విందులు లేవని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ప్రతి మతాన్ని గౌరవించుకుంటున్నామని. బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవడం ప్రత్యేక ప్రార్థనలు జరపడం చాలా సంతోషంగా ఉందని, అల్లాహ్ అందరినీ చల్లగా చూడాలని అందరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మండల బిఆర్ఎస్ పార్టి కార్యదర్శి జూజ్జురపు వెంకన్న, బిఆర్ఎస్ పార్టి అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాష్, మండల నాయకులు జూపల్లి రమణ, మందపాటి మోహన్ రెడ్డి, నారాయణపురం రైతు కమిటీ మెంబర్ చిన్నంశెట్టి వెంకట నరసింహం, అశ్వారావుపేట టౌన్ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, మండల సర్పంచ్లు సంగం అధ్యక్షులు నారం రాజశేఖర్, పేరాయిగూడెం పార్టి ప్రెసిడెంట్ చిప్పనపల్లి బజరయ్యా, నార్లపాటి రాములు, రాంబాబు, కాలపాల శ్రీనివాస్ రావు, సతీష్ రెడ్డి, చిప్పణపల్లీ శ్రీను, సోమని రమేష్, మసీద్ ప్రెసిడెంట్ ఆసీఫ్, జలాల్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.