మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి ఏప్రిల్ 19: మండలం పరిధిలోని మర్రిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల తాటి బుచ్చన్నగూడెం గ్రామానికి చెందిన శ్రీ శ్రీ సీతారామచంద్రస్వామి గుడి నిర్మాణం కొరకు బుధవారం పొంగులేటి శ్రీ నివాసరెడ్డి బలపర్చిన అశ్వారావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 25000 రూపాయలను విరాళంగా ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో జారే ఆదినారాయణ చేతుల మీదుగా అందజేసారు.ఈ కార్యక్రమంలో మర్రిగూడెం ముఖ్య నాయకులు వీరబోయిన నాగేశ్వరరావు,డేగల వెంకటనారాయన,కోమటి గోపాలరావు,తాటి రాజులు,తాటి వీరస్వామి,సవలం కృష్ణ,కొండ్రు రత్నంబాబు,మెచ్చు సురేష్,మడివి నాగరాజు,సవలం వెంకటేష్,పొట్ట వెంకటేశ్వర్లు,సోయం రమేష్,తాటిబాబు,మెచ్చు గోపాలరావు,కొండ్రు సందీప్,మడకం నగేష్,కొండ్రు రవి తదితరులు పాల్గోన్నారు.