మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన పులిగళ్ల మాధవరావును ఆయన నివాసంలో ఇల్లందు మున్సిపల్ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు బుధవారం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీవీ మాట్లాడుతూ.. పార్టీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మాధవరావుకు వివాద రహితుడుగా పేరుందని, పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి అధికార ప్రతినిధిగా నియమించిన జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు, ఆయన పేరును సిఫార్సు చేసిన స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్నకాలంలో మాధవరావుకు మరిన్ని పదవులు రావాలని డీవీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సయ్యద్ ఆజాం, కటకం పద్మావతి, కోఆప్షన్ సభ్యులు రబ్బు, ఆత్మ కమిటీ చైర్మన్ బావుసింగ్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి గుండా శ్రీకాంత్, అధికార ప్రతినిధి కుంట నవాబ్, మాజీ కౌన్సిలర్ ఎలవందల వాసు, యువజన అధ్యక్షులు మెరుగు కార్తీక్, నాయకులు సూర్యనారాయణ, రేఖ, రవిశంకర్, మాడిశెట్టి రాజు, అక్కపల్లి సతీష్, పాలడుగు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
