ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనున్న నేపథ్యంలో చైనా తన అక్కసు వెళ్లబోసుకుంది. అధికజనాభాతో ప్రయోజనం కలగాలంటే ప్రజల్లో నైపుణ్యాలు ఉండాలని చెప్పుకొచ్చింది. కేవలం జనాభా సంఖ్యలో పెరుగుదలతో ఆశించిన ప్రయోజం సిద్ధించదని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెంగ్‌బిన్ తాజాగా మీడియాతో వ్యాఖ్యానించారు. యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్ డేటా ప్రకారం.. 2023 ప్రథమార్థం ముగిసే సరికి భారత్ లో జనాభా చైనాను మించి 142.86 కోట్లకు చేరుకోనుంది. ఈ నివేదికపై స్పందిస్తూ చైనా ప్రతినిధి పై వ్యాఖ్యలు చేశారు.