అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు కొనడాన్ని చాలా మంది శుభసూచకంగా భావిస్తారు. తరతరాల నుంచి చాలా మంది ఈ ఆచారాన్ని పాటిస్తున్నందున బంగారం, వెండి కొనుగోళ్లపై ఆయా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఏప్రిల్ 22న అక్షయ తృతీయ కావడంతో జోయలుక్కాస్, తనిష్క్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాంటి ప్రముఖ కంపెనీలు ఈ ఆఫర్లు ప్రకటించాయి. రూ.10వేలు అంతకంటే ఎక్కువ విలువైన వెండి ఆభరణాల కొనుగోలుపై జోయాలుక్కాస్ రూ.500 గిఫ్ట్ వోచర్‌ను ఉచితంగా అందిస్తోంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి రూ.30వేల కొనుగోలుపై 100 మి.గ్రా.కు సమానమైన బంగారు నాణేలను బహుమతిగా అందిస్తోంది.