మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని సమత్ మోతే గొల్లగూడెం గ్రామపంచాయతి ఉపసర్పంచ్ చేను.సాంబయ్య తల్లి చేను ఎల్లమ్మ గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు విషయం తెలుసుకున్న కరకగూడెం మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల. సోమయ్య నాయకులు వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు.అనంతరం వారు మాట్లాడుతూ అన్ని విధాలుగా అండగా ఉంటామని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రేగా. సత్యనారాయణ,ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపల్లి పెద రామలింగం, యువత్ ప్రెసిడెంట్ గుడ్ల.రంజిత్ కుమార్,బిఅర్ఎస్ పార్టీ గ్రామ కమిటి అధ్యక్షులు మల్కం. వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ప. సత్యం, బట్టా.బిక్షపతి, ఇర్ప. నాగేశ్వరరావు, ముదురుకొళ్ళ.సారంగ పాణి,మోడెం.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
