UPDATES  

 బిఆర్ఎస్ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటాం. *నూతనంగా ఎన్నికైన బిఅర్ఎస్ పార్టీ గ్రామకమిటి అధ్యక్ష, వర్కింగ్ ప్రెసిడెంట్

మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో గురువారం నూతనంగా బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటి అధ్యక్ష,వర్కింగ్ ప్రెసిడెంట్ లను మండల కమిటీ అధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మల్కం.వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ప సత్యం మన్యం న్యూస్ తో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో సైనికుల పనిచేస్తూ పార్టీ నియమ, నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తామని అలాగే విస్తృతంగా ప్రచారం చేయడంలో ముందుంటామని తెలిపారు. అనంతరం మండల అధ్యక్షులు రావుల సోమయ్య మాట్లాడుతూ గతంలో ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షుడు పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో ఆయనను తొలగించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇర్ప.విజయ్ కుమార్,బూర్గంపాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు,మండల బిఅర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బుడగం.రాము అత్మ కమిటి డైరెక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం,సీనియర్ నాయకులు రేగా.సత్యనారాయణ, బుత్ కమిటీ ఇంచార్జీ సుతారి.నాగేశ్వరరావు, యూత్ ప్రెసిడెంట్ గుడ్ల. రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !