మన్యం న్యూస్ కరకగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధినేత నారా.చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మండల కో ఆర్డినేటర్ సిరిశెట్టి.కమలాకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు పాలు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం విఓఏ ల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాయం.లక్ష్మినారాయణ, సిరిశేట్టి.సాయి,తెజ తదితరులు పాల్గొన్నారు.
