మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వివో ఏల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని న్యాయమైన డిమాండ్లను, సమస్యలను, పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మందా నరసింహారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో వివో ఏలు చేపట్టిన సమ్మె సమ్మె4 వ రోజు కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన సంఘీభావాన్ని తెలిపి మాట్లాడారు.
ఈ సమ్మె చేయడానికి ప్రభుత్వమే కారణమని అన్నారు. వీఓఏ ల సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే అధికారులకు, ప్రభుత్వం కు విన్నవించినా స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ ప్రభుత్వం వివో ఏ లకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, పని భారం విపరీతంగా పెంచిందని,
ఆన్లైన్లో రిపోర్టులు ఆఫ్ లైన్ మీటింగ్, ప్రభుత్వ సర్వేలు, అనేక పనులు చేస్తూ ప్రజలకు బ్యాంకులకు మధ్య వారధిగా ఉంటూ కోట్ల రూపాయలు ప్రజలకు బ్యాంకుల నుంచి ఇప్పిస్తూ తిరిగి రికవరీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గుర్తించట్లేదని ఇంత కష్టపడి పని చేస్తున్న జీతాలు పెంచడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదని అవేదన వ్యక్తం చేశారు.
ఈరోజు ఐకెపి వివోఏలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థను సెర్పు ను గుర్తింపు వచ్చేలాగా ముందంజలో ఉంచింది వివో ఏ లే అని వారు అన్నారు. ఇంతల కష్టపడి పని చేస్తున్న వివోఎ ల జీతాలు పెంచకపోవడం దుర్మార్గమని వారన్నారు.
వివో ఏలకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని వివోఏలను సేర్పు ఉద్యోగుల గుర్తించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని ట్యాబులు ఇవ్వాలని ఆన్లైన్ రిపోర్ట్ లు చేయమని గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని వివో ఏ జీతాలు వివో ఏ ఎకౌంట్లోనే వేయాలని అభయ హస్తం డబ్బులు పొదుపు సంఘాలకు ఇవ్వాలని అర్హులైన వివోఏలను సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, ఐద్వా పట్టణ కార్యదర్శి సండకురి లక్ష్మి, వివో ఏల సంఘం నాయకులు రేష్మ తో పాటు సుజతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి మండల వి ఓ ఏ లు తదితరులు పాల్గొన్నారు.