మన్యంన్యూస్,ఇల్లందు టౌన్…ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్న రావుల అంజయ్య దో నెంబర్ నందు జరిగిన నూక విజయలక్ష్మి కర్మలకు ఇల్లందు మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట ఒకటో వార్డు కౌన్సిలర్ వారా రవి, బారాస ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఒకటో వార్డు కమిటీ సభ్యులు కోడి రామకృష్ణ తదితరులు ఉన్నారు
