పండగలా ఆత్మీయ సమ్మేళనాలు
గులాబీ జోరు.. ఆత్మీయ హోరు
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి
వచ్చే ఎన్నికలలో విజయం మనదే
60 లక్షల సభ్యత్వంతో బలమైన శక్తిగా గులాబీ పార్టీ…
ప్రధానమంత్రి మోది దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు…
మణుగూరు పట్టణ ఆత్మీయ సమ్మేళ కార్యక్రమంలో పాల్గొన్న… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని, ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పలు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ దే అధికారం తద్యమని, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం విజయనగరం (తిర్లాపురం) గ్రామంలోని సమ్మక-సారక్క గుడి ప్రాంగణం నందు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మణుగూరు పట్టణంలోని 1వ వార్డు నుంచి 10వ వార్డ్ వరకు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. తొలిత అక్కడ ఏర్పాటు చేసిన గులాబీ జెండాను ఆవిష్కరించారు, పార్టీ శ్రేణులు , పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు…దేశ ప్రజలు భారత రాష్ట్ర సమితి ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తుందని కార్యకర్తలు నాయకులు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నారన్నారు, భూగర్భ జలాలు పెంపొందించేందుకు చెరువులు చెక్ డ్యాములు నిర్మాణం చేసి ప్రతి వర్షపు నీటి నిల్వ చేశారన్నారు.ఆడబిడ్డ పెండ్లిలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు దళిత బంధు పథకంలో అర్హులైన వారిని ఎంపిక చేసి ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు .అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు, ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చ జరగాలని వారన్నారు. రాష్ట్రానికి న్యాయపరంగా ఇవ్వాల్సిన నిధులను కేంద్రం నిలిపివేస్తూ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి కూలీల కొట్టి పెట్టుబడిదారుల కడుపులు నింపుతుందని మండిపడ్డారు, వివిధ రంగాలలో అద్భుత ప్రగతి సాధిస్తూ అభివృద్ధిలో దేశంలోనే వేగంగా దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్రం అవార్డులు ఇచ్చి అభినందిస్తున్నారే కానీ నిధులు ఇవ్వడం లేదని అన్నారు. గత ప్రభుత్వాల హయంలో గురించి ఇప్పుడు ఎలా జీవిస్తున్నమని దానిపై వివరించారు.పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతుందని అన్నారు.నియోజకవర్గం లో సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ నాయకత్వంలో నిధులకు కొరత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు, కోట్లాది రూపాయల నిధులు ప్రభుత్వ నుంచి మంజూరు అవుతున్నాయని వారు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు, యువజన నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు, పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.