మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం,సుదిమల్ల గ్రామపంచాయతీ, కొత్తూరు గ్రామంలో గురువారం కొత్తూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం జరిగింది. ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య హాజరై ప్రారంభించారు. వారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని యువత విద్యతో పాటు క్రీడల్లో సైతం రాణించాలన్నారు. స్నేహపూరిత వాతావరణంలో క్రీడలు నిర్వహించుకోవాలన్నారు.వేసవి కాలం దృష్ట్యా క్రీడాకారులకు మంచినీరు,మజ్జిగ లాంటి తదితర వసతుల ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లో తలపడనున్న కొమరం పులి -చీమల పులి జట్ల మధ్య జరుగుతున్న పోరును టాస్ వేసి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పట్టణ,మండల నాయకులతో కలిసి క్రికెట్ ఆడి యువకుల్లో ఉత్తేజం నింపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, స్థానిక సర్పంచ్ కల్తీ పద్మ, వెంకటమ్మ, రాము, సురేందర్, సాంబమూర్తి, జానీపాషా,తాటి బిక్షం, ఐలయ్య, ఊరుగొండ ధనుంజయ్, సిలివేరు రమేష్, బానోత్ శారద, గ్రామ పెద్దలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.