మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 20, మండల పరిధిలోని పడమట నర్సాపురం రైతు వేదికలో ఉద్యాన, పట్టు పరిశ్రమ, వ్యవసాయ శాఖ, గోద్రెజ్ ఆగ్రోవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మాచినేని పేట క్లస్టర్ పరిధిలోని రైతులకు ఆయిల్ ఫామ్ సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లి ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్లు కె రాము, పి ప్రసాద్ రావులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో ఆయిల్ ఫామ్ పంట సాగు రైతులకు ప్రత్యేక ఆదాయ వనరుగా మారిందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు రైతులు ఎకరాకు కేవలం 1140 రూపాయలు డిహెచ్ఎస్ఓ భద్రాద్రి కొత్తగూడెం పేరున డిడి తీసినట్లయితే, వారికి మొక్కలు అందిస్తున్నామని తెలిపారు. జీఎస్టీ మినహా రైతులందరికీ పూర్తి సబ్సిడీపై డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ లో అంతర పంటల సాగు ఖర్చులకు మూడు సంవత్సరాల పాటు ఎకరాకు 4,200 చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. పంట చేతి కందిన అనంతరం ప్రతి రైతు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో సమానంగా ఆదాయాన్ని పొందవచ్చునని అన్నారు. ఈ పంట అమ్మకాలలో దళారీల ప్రమేయం ఉండదని, మండల కేంద్రంలోని పంట సేకరణ కేంద్రానికి తీసుకొని వస్తే సరిపోతుందని తెలిపారు. కావున పరిసర ప్రాంత రైతులంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ టీ కరుణశ్రీ, ఏవో ఎస్ రఘు దీపిక, మండల రైతు బంధు సమితి కన్వీనర్ వై వీరభద్రం, కొమ్ముగూడెం సర్పంచ్ శాంతి లాల్, ఉప సర్పంచ్ కిషన్, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ లు సంఘం నాగరాజు, చిన్న, భీమారావు, ఏఈఓ లు గోపికృష్ణ, లావణ్య, గౌస్ రైతులు తదితరులు పాల్గొన్నారు.