మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం మండల, రేగళ్ల గ్రామపంచాయతీ పరిదిలోని మద్దెలగూడెం గ్రామంలో రూ.1.50కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్ దురిశేట్టి అనుదీప్ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, నిర్మాణాలు పూర్తయి, రంగులు పూర్తి అవడంతో కరెంటు కలెక్షన్ ఇచ్చి వెంటనే లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నిరుపేద ప్రజలకు గొప్ప వరం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అని అన్నారు. మండలంలో కౌవులూరు, గ్రామంలో 30 రెండు పడకల సముదాయ నిర్మాణాలు పూర్తయ్యాయని వాటిని లబ్ధిదారులకు అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ ఉషా శారద,డిప్యూటీ తహాసిల్దార్ సంధ్య,మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం.రాంబాబు,స్థానిక సర్పంచ్ వసంతరావు, నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.