మన్యం న్యూస్ నూగూర్ వెంకటాపురం .
వెంకటాపురం మండలo ఏకన్న గూడెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిళ్లు దగ్ధం అయింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే. యాకన్న గూడెం చివరలో ఈ రప శ్రీను కుమారి దంపతులు నివసిస్తున్న పూరి గుడిసె షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. వారి ఇంటి పక్కన కరెంటు పోలుకు తగిలించి ఉన్న సర్వీస్ వైరు ఎలుకలు కొట్టి దాని లేయర్లు విడిపోవడంతో వైర్లు ఒకదానికి ఒకటి అంటుకొని నిప్పులు చెలరేగాయి. దాంతో నిప్పులు చిన్న చిన్నగా వ్యాపిస్తూ ఇల్లంతా అంటుకున్నాయి. ఇది గమనించిన గ్రామ ప్రజలు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు అయినా నిప్పులు ఎగసిపడుతూ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది
ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని గ్రామ ప్రజలు తెలియజేశారు. సుమారుగా రూ.5 లక్షల రూపాయలు విలువగల ఆస్తి నష్టం జరిగిందని ఇరుప శీను దంపతులు తెలియజేశారు.
ఈ విషయం గమనించి సదరు మండల తహసిల్దార్ తమకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నట్టు ఇరప సీను దంపతులు వారి ఆవేదన తెలియజేశారు
