మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 21, మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో గల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల ను రాష్ట్ర గిరిజన మోర్చా ఐటీ ఎస్టి సెల్ కన్వీనర్ బీపీ నాయక్ శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా, లేదా అని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుభద్రమ్మను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ను సందర్శించి విద్యార్థునులతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం బీపీ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు పాఠశాలల మౌలిక వసతుల కోసం, విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పన కోసం, వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. ఇక్కడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డొల్లతనం తేట తెల్లమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, గిరిజన మోర్చా భద్రాద్రి జిల్లా కార్యదర్శి భూక్య శ్రీను, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, బీసీవైఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి పసుపులేటి సంతోష్, కొమ్ము విజయ్, గుగులోత్ బాబూలాల్, గుగులోత్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.