మన్యం న్యూస్: సుజాతనగర్, ఏప్రిల్ 21..
సుజాతనగర్ మండల పరిధిలోని డేగలమడుగు ప్రాంతంలో గల మంజీత్ కాటన్ మిల్లు లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిబ్బంది స్పందించి వెంటనే నీటితో మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో స్వల్ప నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.