UPDATES  

 రేగళ్ల ప్రజల కష్టాలను తీర్చడంలో… ఇద్దరూ ఇద్దరే

  • రేగళ్ల ప్రజల కష్టాలను తీర్చడంలో…
  •  ఇద్దరూ ఇద్దరే
  • పేద ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యం.
  • రైతు బిడ్డగా.. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రభుత్వ విప్ రేగా.
  • అసైన్డ్ భూమి పట్టాలు పంపిణీ చేసిన. జిల్లా కలెక్టర్ అనుదీప్
  • 108 మందికి లబ్ధి దారులకు పట్టాల పంపిణీ.మన్యం న్యూస్ కరకగూడెం: రేగళ్ల ప్రజలు ఎన్నో ఏళ్లగా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు వారి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ అసైన్డ్ భూముల సర్వే చేయించి వారికి ప్రభుత్వం గుర్తింపు పొందిన పట్టాలు వచ్చే విధంగా కృషి చేయడంలో ఇద్దరూ ఇద్దరే నిరూపించుకున్నారు. గ్రామ సభలు నిర్వహించి పట్టాలు తయారీ చేసి శుక్రవారం రేగళ్ల గ్రామపంచాయతీలో తహాసిల్దార్ ఉషా శారద డిటి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అసైన్డ్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ హాజరై గిరిజనులకు 108 మంది లబ్ధిదారులకు 400 ఎకరాల భూమి పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ వ్యాప్తంగా కరువు కాటకాలు కరెంటు కోతలతో విసికి వేజారిన ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాయన్నారు. గిరిజనులకు ప్రభుత్వ పట్టాలు అందించడం వారు ఎన్నో ఎల్లగా భూమిని సాగు చేస్తున్న హక్కు పత్రాలు గత ప్రభుత్వాలు ఇవ్వలేదని. రేగళ్ల గ్రామ పంచాయతీలో 120 మంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో 108 మందికి పంపిణీ చేయడం తమకెంతో ఆనందంగా ఉందని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనత అని ఆయన అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, కల్వర్టు, చెక్ డ్యాములు, సీసీ రోడ్లు, బిటి రోడ్లు, డబల్ బెడ్ రూములు, అనేక సంక్షేమ పథకాలు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. వేసవికాలం వచ్చింది అంటే బిందెలు పట్టుకొని ఆడపడుచులు రోడ్లమీద ధర్నా చేసేవారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి గోదావరి నీళ్లు నల్లాల ద్వారా అందించి నిటి కష్టం లేకుండా చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పులుసు బొంత ,వట్టి వాగు ప్రాజెక్టులతో సస్యశ్యామలం అవుతుందని నియోజకవర్గం ప్రజలు రెండు పంటలు పండించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. గ్రామాలలో సమస్యలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను గుర్తించి అధికారులకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ. ట్రైనీ కలెక్టర్గా ఉన్నప్పుడు కరకగూడెం ఇన్చార్జి ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహించినప్పుడు రేగళ్ల గ్రామపంచాయతీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. చాలామంది ప్రజలు సర్పంచ్ తమ వద్దకు వచ్చి ఏళ్ల నుండి ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటున్నాం మాకు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ రేగా కృషితో అసైన్డ్ సర్వే జరిపి అర్హులకు పట్టాలు పంపిణీ చేయడం మొదటి విడతలో 108 మందికి 4 వందల ఎకరాల అసైన్డ్ భూమి పట్టాలు పంపిణీ చేయడం ప్రజల కష్టాలు తీర్చడం ద్వారా తమకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ప్రతి ఏటా అసైన్డ్ భూమి లబ్ధిదారులకు 40 లక్షల రైతుబంధు అందుతుందని దాని ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ శ్రీనివాస్, ఎంపిపి రేగా కాళికా సర్పంచ్ కుంజ .వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !