UPDATES  

 అభివృద్ధి సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

  • అభివృద్ధి సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
  • రూ.11 కోట్ల,92 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు: ఏప్రిల్ 21

మణుగూరు మండలం లోని గుట్ట మల్లారంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో డార్మిటరీ బ్లాక్ నిర్మాణం కోసం రూ. 2 కోట్ల 70 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.అనంతరం రామానుజవరం పంచాయతీ లోనీ బి.టి.పి.ఎస్ రైల్వే ట్రాక్ లో భూములు,కోల్పోయిన బాధితులకు సమీకృత గిరిజన అభివృద్ధి లో భాగంగా రెండు పడక గదుల గ్రామీణ గృహ నిర్మాణ పథకం ద్వారా రూ. 4 కోట్ల 53లక్షల రూపాయల తో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.కొత్తగా నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీ,మౌలిక సదుపాయాలు, వసతులు,సీసీ రోడ్డు,సైడ్ కాలువల నిర్మాణ పనులకు రూ.4 కోట్ల 68 లక్షల రూపాయలతో విప్ రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు.గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.అందులో భాగంగా కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమ పథకాలతో ముందుకు పోతుందన్నారు. రైతులకు రైతుబంధు,రైతు బీమా ద్వారా రైతులకు భరోసా కల్పించడం,జరుగుతుందన్నారు.దళిత బంధు పథకం ద్వారా దళితుల అభ్యున్నతికి,ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.అభివృద్ధి,సంక్షేమ పథకాలతో రాష్ట్రం పురోగతి సాధిస్తూ,దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు.గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తు,నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు,మంత్రి కేటీఆర్ కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు,ఎంపీపీ కారం విజయకుమారి,ప్రజాప్రతినిధులు,సర్పంచ్ లు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,సీనియర్ నాయకులు వట్టం రాంబాబు,యాదగిరి గౌడ్,యువజన నాయకులు, కార్యకర్తలు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !