UPDATES  

 సృజనకిరణం పుస్తకం ఆవిష్కరించిన ఎంపీపీ జల్లిపల్లి

 

మాన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 21: అశ్వారావుపేట కాంప్లెక్సు సిఆర్పి సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు సంపాదకత్వంలో కాంప్లెక్సు పరిధిలోని విద్యార్దుల రచనలతో వెలువడుతున్న సృజనకిరణం పుస్తకాన్ని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఆవిష్కరించారు. శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు సిహెచ్ నర్సింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈపుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మాట్లాడుతూ పిల్లల్లో దాగిన సాహిత్యాభిలాషను వెలికితీసి వారితో రచనలు చేయించడమే గాకుండా వాటిని పుస్తక రూపంలో తీసుకురావడం ఎంతో అభినందనీయమని అన్నారు. కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు నర్సింహారావు మాట్లాడుతూ బాలల మదిలో అంతులేని సృజన సంపద దాగి ఉందని వాటిని వెలికి తీసే ప్రయత్నాలు కొనసాగితే అద్భుత కళాఖండాలు బయటకు రావడమే కాకుండా పిల్లల్లో మానసిక ఎదుగుదల ఏర్పడుతుందని అన్నారు. సృజన కిరణం సంపాదకులు ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ బాలసాహిత్యం ఇప్పుడు కొత్తపుంతలు తొక్కుతుందని కాంప్లెక్సుస్థాయిలోని ప్రాధమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉన్న విద్యార్ధుల రచనలతో ప్రతిపాఠశాలలో గోడపత్రికలు క్రమంతప్పకుండా నిర్వహిస్తున్నారని, ఆ గోడపత్రికలలోని అంశాలే సృజనకిరణంగా మలిచామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందపాటి రాజమోహనరెడ్డి, ఉపాధ్యాయులు రాంబాబు, కాంప్లెక్సు కార్యదర్శి రామినేని రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !