మన్యం న్యూస్,ఇల్లందు టౌన్..ఈనెల 25వ తేదీన ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని పండుగలాగా జరపాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇల్లందు పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆదేశాల మేరకు నిర్వహించనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు అందరూ అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…పార్టీ పటిష్టతకు సంబంధించి ఈనెల 25వ తేదీన ఇల్లందులోని వ్యవసాయ మార్కెట్ నందు నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయసభను విజయవంతం చేయాలని పార్టీశ్రేణులను కోరారు. 60 లక్షలకు పైగా పార్టీ సభ్యత్వ నమోదు కలిగిన ఏకైక ప్రాంతీయపార్టీ బీఆర్ఎస్ అని, కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, ఎస్కే పాషా, పర్రే శ్రీనివాస్, సెక్రెటరీ సునేష నాయక్, ఆర్గనైజర్ సెక్రెటరీ సనా రాజేష్, ఇల్లందు పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి సత్తాల హరికృష్ణ, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షురాలు శ్రీమతి గండ్రాతి చంద్రావతి, బొప్పి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.