మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 22::
నాటక కళా రంగానికి కళాకారుల అభివృద్ధికి మండలంలో విశేష కృషిచేసిన హెడ్మాస్టర్ డేవిడ్ విల్సన్ మరణం రంగస్థల నాటక రంగానికి తీరని లోటు అని తెలంగాణ నాటక సమాజాల సమైక్య జిల్లా కార్యదర్శి కొమరం దామోదర్ అన్నారు సీతానగరం గ్రామంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి కళాకారులందరూ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్ణశాల సీతానగరం గ్రామాల్లో 1980 నుంచి 2005 సంవత్సరాల వరకు నాటక రంగా కళాకారులను ఆనాటి కాలంలో నాటక ప్రదర్శనలో మ్యూజికల్ పాటలకు బాణీలు కట్టడం వారి ప్రత్యేకతని తెలిపారు ఈ కార్యక్రమంలో ముక్కెర రాంబాబు రంగపుర రాంబాబు ప్రభాకర్, తెల్లం హరికృష్ణ గోసంగి కిరణ్ పిలక రాంబాబు భాను ప్రకాష్ ముత్తయ్య సంతోష్ కుమార్ అబ్బులు బుజ్జి తదితరులు పాల్గొన్నారు.