మన్యం న్యూస్ అశ్వాపురం: ఏప్రిల్ ..అశ్వాపూరం మండల పర్యటన లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భానోత్ మదన్ లాల్ మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సంధర్బంగా మే 11 తేదీ న తన కుమారుడు వివాహ వేడుకకు హాజరు కావాలంటూ విప్ రేగా కు ఆహ్వాన పత్రికను వారు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అశ్వాపురం మండల అధ్యక్షులు కోడి అమరేందర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు వెన్న అశోక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.