UPDATES  

 విజ్ఞాన శాస్త్రాలపై దాడిలో భాగమే……డార్విన్ సిద్ధాంతం తొలగింపు.

విజ్ఞాన శాస్త్రాలపై దాడిలో భాగమే……డార్విన్ సిద్ధాంతం తొలగింపు.

– విద్యలో మూఢత్వాన్ని ప్రతిఘటించాలి.
– సిఐటియు రాష్ట్ర కార్యదర్శి .బి మధు

విజ్ఞాన శాస్త్రాలపై దాడిలో భాగమే డార్విన్ సిద్ధాంతాన్ని ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి కేంద్ర బిజెపి ప్రభుత్వం తొలగించిందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మధు పేర్కొన్నారు. భారతదేశాన్ని బిజెపి మూడోత్వంలోకి నెట్టి వేస్తుందని, విద్యారంగంలో మూఢత్వాన్ని ప్రతిఘటించాలని, దేశాన్ని అభివృద్ధి పదంలో శాస్త్ర విజ్ఞానం వైపు నడిపించవలసిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి. మధు అన్నారు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో. సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ దేశ ప్రజల చరిత్రను, స్వతంత్ర పోరాటాలను, కార్మిక ఉద్యమ చరిత్రను బిజెపి వక్రికరిస్తుందని. నిజమైన ప్రజా చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి చరిత్ర గ్రంథాల నుంచి పురావస్తు శాఖల రికార్డుల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడం సరైంది కాదనీ మధు విమర్శించాడు. దేశం కోసం ,ప్రజల కోసం పోరాడిన చరిత్ర లేని బిజెపి, ఆర్ఎస్ఎస్ … చరిత్రలోనే వాస్తవాలను చెరిపి వేయడం ద్వారా తన సొంత చరిత్రను ప్రచారం చేసుకుంటూ ఉందని విమర్శించారు. ప్రజల పోరాటాలు, ప్రజల జీవన విధానం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతీయ చరిత్రను రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని మధు అన్నారు. నరేంద్ర మోడీ తన అధికారం కోసం దేశ సైన్యం ప్రాణాలను బలి తీసుకున్నడని అది మోడీ కుట్రలో భాగమే పుల్వామా ఉగ్ర దాడి అని కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యసాల్ మాలిక్ చేసిన విమర్శలు ఆరోపణలపై నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. సైన్యాన్ని బలిపీఠం ఎక్కించి వారు త్యాగాలను అధికారం కోసం బిజెపి వాడుకోవడం దేశద్రోహపూరితమైందన్నరు. సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక మూవీ చేసిన దేశ వ్యక్తులకు చర్యలు తెచ్చుకునేందుకు సత్యపాల్ మాలిక్ పై సిబిఐ ఐటి ఈడి దాడులు చేయించడం హేయమైన చర్యగా సిఐటియు పేర్కొన్నది. కేంద్ర బిజెపి ప్రభుత్వం వైఫల్యాలను తప్పులను బయటపెట్టిన వారిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న, విమర్శిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధించటం ద్వారా మానవ హక్కుల పైన ప్రజాస్వామిక హక్కుల పైన బిజెపి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వంలో దాడి చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ప్రజాస్వామిక లౌకిక శక్తులతో కలిసి కార్మికులు ఐక్యంగా పోరాడాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి.మధు పిలుపునిచ్చారు.
కార్మిక హక్కుల పైన రాజ్యాంగం పైన బిజెపి ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడికి వ్యతిరేకంగా మే ఒకటి మేడే నుండి మే 30 సి ఐ టి యు ఆవిర్భావ దినోత్సవం వరకు ప్రచార కార్యక్రమాలను చేస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ జే రమేష్ తెలిపారు. మే 1 నుండి కార్మిక పని కేంద్రాలు నివాస ప్రాంతాలు గ్రామాలలో సిఐటియు జెండా ఆవిష్కరణలు చేయాలని, మేడే చరిత్ర ,కార్మిక ఉద్యమ చరిత్రను వివరించే విధంగా మేడే సాంస్కృతిక వారోత్సవాలు జరుపుతున్నమన్నరు. వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాన్ని కలుపుకొని గ్రామ గ్రామాన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి తెలియజేస్తామని ఎజే రమేష్ తెలిపారు. సిఐటియు జిల్లా కమిటీ సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధికారి జి. పద్మ ,జిల్లా ఆఫీస్ బెరర్లు గద్దల శ్రీను, డి వీరన్న, ఈసం వెంకటమ్మ ,కే.సత్య, సూరం ఐలయ్య, నాయకులు ఎస్ ఏ నభి, భూక్యా రమేష్, మొగిలి నరసింహారావు, చిలకమ్మ, అరుణ, సుశీల, దుర్గమ్మ, తిరుపతి, ఝాన్సీ, భాష, కృష్ణ, నిమ్మలమధు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !