మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అకాల వర్షాలకు, గాలిదుమారానికి తీవ్రంగా నష్టపోయిన మామిడి, మిర్చి రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్
పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాపితంగా శనివారం రాత్రి కురిసిన వర్షాని చేతికొచ్చిన మిర్చి, కల్లాల్లో నిల్వ ఉంచిన మిర్చి నీటిపాలైందని, అదేవిదంగా ఈదురు గాలులకు మామిడి నేలమట్లమై నష్టం వాటిల్లిందన్నారు. అదేవిదంగా పేదలు నివాసముండే గుడిసెలు, రేకుల ఇండ్లు పూర్తిగా దెబ్బతిని నిరాశ్రయులయ్యారన్నారు. సంబంధిత అధికారులు జరిగిన నష్టంపై తక్షణమే సర్వే నిర్వహించి సంబందిత నివేదికను ప్రభుత్వానికి అందించి నష్టపోయిన రైతులకు, పేదలకు పరిహారం అందించే విధంగా సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమాపై నిర్లక్ష్యం వహించడంవల్లే అతివృష్టి, అనావృష్టితో రైతాంగం తీవ్రంగా నస్టపోతున్నారని, ఎప్పటికైనా పాలకులు రైతాంగా సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారంపై ప్రకటన విడుదల చేసి రైతులకు, పేదలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.