UPDATES  

 మారుమూల గ్రామాలకు మహర్దశ

మారుమూల గ్రామాలకు మహర్దశ
*ఆదివాసీ గిరిజన తండాల సమగ్రాభివృద్ధికి నిధులు మంజూరు.
ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి వైరా నియోజకవర్గం కు రోడ్లు మంజూరు చేసిన ప్రభుత్వం.

* జూలూరు పాడు మండలం పాపకొల్లు నుంచి ఏన్కూర్ మండలం బురదరాఘవపురం వరకు 13 కిలోమీటర్ల బిటి రోడ్డు నిర్మాణానికి ఎస్ డి ఎఫ్ కింద రూ.9.75 కోట్లు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
*
కాకర్ల లో సి. సి. రోడ్డు నిర్మాణానికి రూ.42 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం.

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. కొత్తగా మంజూరు చేసిన పనులకు ప్రభుత్వo అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. అనుమంతించబడిన బిటి రోడ్ల పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎస్టీ అభివృద్ధి నిధులతో మంజూరైన బిటి , సి సి రోడ్ల పనులను వెంటనే ప్రారంభించేందుకు పంచాయతీ రాజ్ విభాగం సన్నద్ధంగా ఉంది. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులు రోడ్ల నిర్మాణ పనుల సర్వేలను నిర్వహిస్తున్నారు. ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం పాపకొల్లు నుంచి ఏన్కూర్ మండలం బురధరాఘవాపురం వరకు రూ.9.75 కోట్ల అంచనాతో ప్రభుత్వం మంజూరు చేసిన 13 కిలోమీటర్ల బిటి రోడ్ల పనులు చేపట్టేందుకు సర్పంచ్ ల సమక్షంలో పంచాయతీ రాజ్ విభాగం అధికారులు సర్వే కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 6 నెలలలో పనులు పూర్తి చేయనున్నారు. వాగులు, వంకలు పైన నిర్మించే పనులు మార్కింగ్ చేస్తున్నారు. మొత్తం 13 కిలోమీర్లు లో 10.80 కిలోమీటర్లు పొలాలు, గిరిజన గ్రామాలు మధ్య వుంది. మిగిలిన ఏరియా అటవీ ప్రాంతంలో వుంది. కనెక్టివిటీ లేని ఎస్టీ ఆవాసాలకు కనెక్టివిటీలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం పట్ల సర్వత్రా గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిటి రోడ్లు అందుబాటులోకి వస్తే గిరిజనులకు రవాణా సౌకర్యాలు మెరుగై విద్యా, వైద్య, నిత్యావసర వస్తువులు తదితర అనేక సౌలభ్యాలు కలిగి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు పొందేందుకు వీలుపడుతుంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దశాబ్ధాలుగా జనజీవన స్రవంతికి దూరంగా ఉన్న వేలాది తండాలు, గూడేలు అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలతో స్వయంపాలన, సాధికారతలతో గ్రామాలు అభివృద్ధి పధంలోకి వస్తున్నాయి. మన ప్రభుత్వం- మన పాలనకు చిహ్నంగా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి పనులను వేగంగా పూర్తి చేయుటకు కార్యాచరణ రూపొందించారు. బిటి రోడ్ల నిర్మాణంతో గిరిజనుల గ్రామాలకు బాటలు వేసిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదే అంటూ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .మారుమూల వాగులు వంకలు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజన గ్రామాలు ప్రజలకు ఈ బిటి రోడ్ల నిర్మాణంతో రవాణా సదుపాయం పెంపొందుతుంది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో ఆదివాసీ గిరిజనుల దీర్ఘకాల సమస్య పరిష్కారం అవుతున్నది. అలాగే కాకర్ల పంచాయతీ రాజ్ రోడ్డు నుంచి రూ.42 లక్షల వ్యయంతో వేయనున్న సి సి రోడ్డు పనులను కూడా త్వరలోనే చేపట్టనున్నారు.
ఈ నిర్మాణ పనులను రెగ్యులర్ గా మానిటరింగ్ చేయనున్నట్లు పంచాయతీరాజ్ ఈ ఈ కె. సుధాకర్, డి ఈ వి. సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !