మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలం రాయిగూడెం గ్రామానికి చెందిన రామారావు వయసు 26సం.కీడ్ని సంబంధిత వ్యాధి తో బాధపడుతూ వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నాడు. విషయం తెలుసుకున్న మణుగూరు పట్టణానికి చెందిన “జనం కోసం మనం” స్వచ్చంద సంస్థ రూ.10వేల రూపాయలు నగదు, భద్రాచలం పట్టణానికి చెందిన దుర్గా స్వీట్స్ అధినేత బిర్రు సుధాకర్, సరిత దంపతులు 50కేజీల బియ్యం సహాయంగా అందించారు . ఈ కార్యక్రమంలో జనం కోసం వ్యవస్థాపకులు గూడూరు కృష్ణారెడ్డి, సంస్థ సభ్యులు సాయిరాం,నరేష్ కుమార్, గుంటక శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గున్నారు.