మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఇల్లందు ఎస్ హెచ్ఓ బానోత్ రాజు బదిలీపై వెళ్ళటంతో ఇల్లందు నూతన సీఐగా కరుణాకర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ కరుణాకర్ ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు హరిప్రియ హరిసింగ్ నాయక్ ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇల్లందు నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్ కు ఎమ్మెల్యే హరిప్రియ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. నేరరహిత పట్టణంగా ఇల్లందును తీర్చిదిద్దాలని, యువత గంజాయి బారిన పడకుండా గంజాయిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
