UPDATES  

 ప్రభుత్వం విఓఏలను ఆదుకోవాలి -మాజీ ఎమ్మెల్యే తాటి

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 23: మండల కేంద్రంలో పాత మండల పరిషత్ కార్యాలయం వద్దా సీఐటీయూ ఆధ్వర్యంలో ఐకెపి వీఓఏల నిర్వదిక సమ్మె ఆదివారం ఏడవ రోజు చేరుకుంది. గ్రామ దీపికలు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఆదివారం అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తాటి కి వివరించారు. ప్రభుత్వం విఓఏలను అన్నిరకాలుగా ఆదుకోవాలని వారికి మద్దతుగా సంఘీభావం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయుకులు జేష్ఠ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెన్నకేశవరావు, ఎంపీటీసీలు వేముల భారతి, సత్యవరపు తిరుమల, గ్రామ దీపికలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !