అఖిల్ ఏజెంట్ ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందించిన ఈ సినిమా కు ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వలేదు అనే విషయం వాస్తవం.
నేడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని వరంగల్ లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఇక సినిమా మరో ఈవెంట్ ని హైదరాబాదులో నిర్వహించేందుకు గాను ఏర్పాటు జరుగుతున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
నేడు వరంగల్ ఈవెంట్ కి నాగార్జున హాజరు కాబోతుండగా.. హైదరాబాద్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కాబోతున్న నేపథ్యంలో ఏజెంట్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో సినిమాను తెలుగు మరీ మలయాళంలోనే విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తెలుగు మరియు మలయాళంలో సక్సెస్ అయితే ఆ తర్వాత హిందీలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట.