మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
వివక్షత లేని సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సురేందర్ అన్నారు. ఆదివారం మహాత్మా బసవేశ్వరుని 890 జయంతిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి సమావేశపు హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవానికి కలెక్టరేట్ పరిపాలన అధికారి గన్యాతో కలిసి బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బిసి సంక్షేమ అధికారి సురేందర్ మాట్లాడుతూ కుల, వర్ణ, వర్గ, జాతి, లింగ, మత వివక్షత లేని సమ సమాజ స్థాపన కోసం కృషిచేసిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని చెప్పారు. ప్రజలంతా సమానమేనని, వివక్షలతో సంబంధం లేకుండా కలిసి ఉండాలని సమానత్వం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి బసవేశ్వరుడు అని అన్నారు. ప్రజలను ఏకం చేస్తూ వీరశైవ మతాన్ని ఏర్పాటు చేశారని, ఆహారం, ఇల్లు, వస్త్రాలు, జ్డానం, వైద్యం కనీస హక్కులని, భక్తి కన్నా సత్ర్రవర్తన, మానవత్వం ముఖ్యమని చాటి చెప్పారని తెలిపారు. మహాత్మా బసవేశ్వరుడు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషమని మహనీయుల త్యాగాలు నేటి తరాలకు తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
బిసి యువజన సంగ రాష్ట్ర కార్యదర్శి మెట్టెల సైదుబాబు, అశ్వారావుపేట నియోజక వర్గ యువజన సంగ అధ్యక్షుడు పల్లె వీర ప్రసాద్, బిసి సంగం జిల్లా అధ్యక్షులు రెడ్డిమల్ల వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.