UPDATES  

 అధికారులకు వాటా ఎంత*? ఎదేచ్ఛగా గుడుంబా విక్రయాలు

అధికారులకు వాటా ఎంత*?
ఎదేచ్ఛగా గుడుంబా విక్రయాలు
చదువుకునే వయసులో గుడుంబాకు బానిసలు అవుతున్న యువకులు
ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికారులు
మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
వెంకటాపురం మండలం వీరభద్రారం గ్రామం శివారులో గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి, పట్టించుకునే అధికారులే ప్రోత్సహిస్తున్నట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఊరు శివారు అడవిలో ఎటు చూసినా గుడుంబా స్థావరాలు ఊర్లో ఉండే చలివేంద్రాలని తలపిస్తున్నాయి. ఆయా శాఖ అధికారులు వచ్చి తనిఖీలు చేసిన ప్రయోజనం ఏమీ లేదని గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు . ఎక్కడ చూసినా గుడుంబాబట్టిలే దర్శనమిస్తున్నాయి, ఈ గుడుంబా విక్రయించే వారి వ్యాపారం వీరభద్రారం గ్రామంలో మూడు పువ్వులు ఆరుకాయలుగా సజావుగా సాగుతుంది. అడిగే దిక్కు లేదు ప్రశ్నించే అధికారి లేడు, దాంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా వారి వ్యాపారం కోట్లకు పడగలు ఎత్తుతున్న పరిస్థితులు ఆ గ్రామంలో కనబడుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు నామకార్దపు తనిఖీలు చేసి వెళుతుంటే, వారి నిర్లక్ష్యానికి ప్రతిఫలం యూరియాతో తయారైన గుడుంబాలు తాగి యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనే వీరభద్రరం గ్రామంలో చోటు చేసుకుంది. ఒక బీదవాన్ని కుటుంబాన్ని నేలకరిచేలాగా చేసింది. వివరాల్లోకి వెళితే. బొల్లె సాంబయ్య అనే యువకుడు గుడుంబాకు బానిసై గత నాలుగు నెలలుగా లివర్ కరాబ్ అయి కిడ్నీలు ఫెయిల్ అయ్యి మంచాన పడ్డాడు. అసలే బీదరికం దానికి తోడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి వికలాంగురాలు, చిన్నమ్మాయిని చదివించే స్తోమత లేక కూలి పనులకు పంపిస్తున్నటూ తన భార్య తెలిపింది . అసలే పేదరికంతో కుప్పకూలి ఉంటే గుడుంబా అతని జీవితా వినాశనానికి దారితీసింది. దీనికి ప్రధాన కారణం ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమే అని గ్రామ ప్రజలు తెలియజేశారు. ఇదిలా ఉండగా గుడుంబాకు బానిసైన సాంబయ్య అనే యువకుడ్ని ఎన్ని హాస్పిటల్ తిప్పిన నయం కాకపోవడంతో తన భార్య దగ్గర డబ్బులు లేక అలానే ఇంటికి తీసుకు వచ్చిందని ఆమె తెలిపింది. మెరుగైన వైద్యం కోసం పెద్ద హాస్పటల్ కు తీసుకుపోయే అంత స్తోమత లేక తన భర్తను ఎలాగైన కాపాడుకోవాలని సదుద్దేశంతో గ్రామ సర్పంచ్ సహాయం కోరినట్టు ఆమె తెలిపారు. ఇవన్నీ బాధలకు కారణం గుడుంబా విక్రయించేవారు వారిని ప్రోత్సహించే అధికారులు అని చావు బ్రతుకులతో ఉన్న తన భర్త దగ్గర ఏడుస్తూ ఈ గుడుంబా విక్రయాలను ఆపలేనప్పుడు వారికి ఉద్యోగాలు ఎందుకని ప్రశ్నించింది. తన బర్త్డే కాకుండా ఊర్లో ఇంకా పదిమందికి పైగా గుడుంబా తాగి చావు బతుకులతో మంచాన పడి కొట్టుమిట్టాడుతున్నారని ఆమె తెలిపింది. ఊర్లో ఉన్న మహిళలందరూ పలుమార్లు గుడుంబా విక్రయించే వారి తోటి గుడుంబా అమ్మకాలు జరపవద్దని ఎన్ని సార్లు చెప్పిన భయం లేని వారి వ్యాపారం చూస్తే ఎక్సైజ్ అధికారులతో పార్టనర్షిప్ చేస్తూ వారితో అంమీ స్తున్నారు ఏమో అని గ్రామ ప్రజలు వారి బహిరంగ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుడుంబా స్థావరాల కెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తే ఎక్సైజ్ అధికారులకు పైకం చెల్లిస్తున్నామంటూ మీరేం చేసుకుంటారో చేసుకో పొమ్మని బహిరంగంగానే చెబుతున్నట్టు గ్రామ లో ఉన్న మహిళలు ఆరోపిస్తున్నారు.
ఇంకా కొసమెరుపు ఎవరికైనా చెబితే వారి ఇంటి పైన గొడవలకు దిగుతున్నట్టు గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు గ్రామ సర్పంచి కూడా గుడుంబా విక్రయించే వారికి భయపడుతుందంటే అధికారులు కూడా విక్రయించే వారితో మమేకమై ఉన్నట్టు ఉండొచ్చని గ్రామ ప్రజలు వారి బహిరంగ అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఈ గుడుంబా వల్ల ఎంతమంది చనిపోతారో ఎన్ని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారో అని పిల్లల తల్లిదండ్రులు, మరియు మహిళలలు వారి భయాన్ని వ్యక్తపరుస్తున్నారు. చదువుకునే వయసులో మద్యానికి బానిసయి మరణించడానికి సిద్ధంగా ఉన్న తమ పిల్లలను చూసి ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో అధికారులపై మండిపడుతున్నారు. దేశానికి రైతు వెన్నెముకగా ఎలా ఉంటాడో, యువకులు కూడా దేశానికి అంతే పాత్ర వహిస్తారని నేటి బాలల రేపటి పౌరులని గుర్తు చేసుకోవాలని, వారి బ్రతుకులు అర్ధాంతరంగా ఆగిపోకుండా ఆయా శాఖ ఉన్నత అధికారులు ఈ గుడుంబా విక్రయాలను వీరభద్రారం గ్రామం నుంచి తరిమికొట్టాలని లేనియెడల గ్రామమంతా రోడ్డు మీద ధర్నా చేస్తామని ఇంకా వినకపోతే రాస్తారోకోకు దారితీస్తామని పత్రికాముఖంగా తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !