మన్యం న్యూస్ పినపాక :
రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి విఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా పినపాక మండల కేంద్రంలో 10వ రోజు బుధవారం విఓఏలు రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. విఓఏలు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, తదితర డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు.