దద్దరిల్లిన దండకారణ్యం
దంతేవాడలో మావోయిస్టుల బరితెగింపు
పేల్చిన మందు పాతర 10 మంది జవాన్లు
ఒక డ్రైవర్ మృతి
మన్యం న్యూస్ చర్ల : చత్తీస్గడ్ రాష్ట్రం దంతేవాడలో దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. మావోయిస్టులు హెచ్చరికలతో ప్రతీకార చర్యగా ఘోర ఘాతుకానికి పాల్పడ్డారు.. దంతెవాడ జిల్లా అరన్పూర్ సమీపంలో
జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సుపై ఎల్ ఈ డి తో మందుపాతర పేల్చారు.ఈ ఘటనలో 10మంది జవానులు మృతిచెందగా ఒక డ్రైవర్ కూడా మృతి చెందారు. వీరంతా జి ఆర్ డి కి సంబంధించిన బలగాలుగా గుర్తించారు .మరికొంతమంది జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించడం జరిగింది. దంతెవాడ అడవి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం పోలీసులకు అందడంతో భారీ బలగాలు అడవి ప్రాంతం చుట్టూ మోహరించినట్లు సమాచారం. అయితే వేసవికాలంలో ఆకురాలిచ్చే సమయంలో పల్చబడిన అడవిలో మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించిన కూంబింగ్ నిర్వహించి తిరిగి వస్తుండగ 20 మంది జవాన్లతో ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ పై ఐఈడి మందు పాత్ర పేల్చడంతో జవానులు ప్రయాణిస్తున్న మినీ వ్యాను తునా తునకలు అయింది . అయితే ఇదే ప్రాంతంలో గతంలో పోలీస్ బలగాలు మావోయిస్టులపై కూంబింగ్ ప్రతిసారి నిర్వహిస్తుండడంతో ఇటీవల కాలంలోనే ఒక లేఖను సభ్యులు విడుదల చేసి హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ పోలీసులు బలగాలు మావోయిస్టులపై ప్రతిసారి కూలింగ్ నిర్వహిస్తుండడంతో ప్రతి కార్యచరేగా మావోయిస్టులు ఈ దుశ్చర్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది.