మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఒడ్డుగూడెం గ్రామపంచాయతీ నెహ్రునగర్ తండాకి చెందిన బానోత్ ధన్య దశదిన కర్మలకు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హాజరై ధన్య చిత్రపటానికి నివాళులర్పించి,వారి కుటుంబాన్ని పరామర్శించారు.అదే గ్రామానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బానోత్ రమేష్ , గ్రామ శాఖ అధ్యక్షులు భూక్య నాగరాజు వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడి గాయాల పాలయ్యారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి స్వగృహాలకు వెళ్లి పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన పై వారి నుంచి పూర్తి సమాచారం తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు.ఈ పర్యటనలో ఎమ్మెల్యే హరిప్రియ వెంట బయ్యారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వైస్ ఎంపీపీ తాత గణేష్ , ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు బానోత్ వెంకటేష్, మండల నాయకులు బింగి వెంకన్న , రేపల్లె వాడ గ్రామ శాఖ అధ్యక్షులు సూత్రపు సమ్మయ్య , బనిషా సలీం, తదితరులు ఉన్నారు.