మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 26
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బుధవారం తెలంగాణ ఐకెపి,వివోఏ,ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా తమ సమస్యలు,పరిష్కరించాలంటూ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యలపై విప్ రేగా స్పందిస్తూ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, సోషల్ మీడియా అధ్యక్షులు సందీప్ రెడ్డి,ఐకెపి,వివోఏ, ఉద్యోగుల తదితరులు పాల్గొన్నారు.