పిసిసిఎఫ్ (కాంపా ) లోకేష్ జయశ్వల్..
మన్యం న్యూస్ చండ్రుగొండ ఏప్రిల్ 26: శ్రీనివాసరావు మెమోరియల్ భవనాన్ని తాను ప్రారంభించడం ఆనందంగా ఉందని అటవీశాఖ పిసిసిఎఫ్ (కాంపా ) లోకేష్ జయశ్వల్ అన్నారు. బుధవారం చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని ( శ్రీనివాసరావు మెమోరియల్ భవన్ ) ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు విధి నిర్వహణలో మృతి చెందడం బాధాకరమైన విషయమని, ఆయన లేని లోటు అటవీ శాఖకు తీరనిలోటని, ఆయన నిజాయితీకి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయనికి ఆయన పేరు పెట్టడమేమన్నారు. ఆయన విధుల్లో చూపిన అంకితభావం, డిపార్ట్మెంటుకు స్ఫూర్తిదాయకమన్నారు. అడవుల రక్షణ కోసం అటవిశాఖ సిబ్బంది, అధికారులు నిరంతరం అడవులు సంరక్షించడమే మా ప్రధాన కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సిసిఎఫ్ భీమానాయక్ , డీఎఫ్ఓ రంజిత్ నాయక్, ఎఫ్డిఓ అప్పయ్య, ఇంచార్జ్ రేంజర్ ప్రసాద్ రావు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.