ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా వివొఏ ల పోరాటం ఉదృతం చేయాలి.
సీఐటీయూ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ..
భూక్య రమేష్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ప్రత్యక్ష పోరాటం కొనసాగిస్తూనే, టెక్నాలజీ ఉపయోగించుకుని సోషల్ మీడియా ద్వారా వివోయె ల పోరాటాన్ని ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు చేరేలా, పాలక వర్గాలకు కనువిప్పు కలిగేలా ఐకెపి వివోయే ల పోరాటాలను కొనసాగించాలని సీఐటీయూ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ భూక్యా రమేష్ అన్నారు. బుధవారం కొత్తగూడెం పట్టణంలో పదవ రోజు సమ్మె సందర్బంగా వివోయ ల దీక్ష శిబిరం వద్ద “సోషల్ మీడియా నేటి కర్తవ్యం” పై భూక్యా రమేష్ క్లాస్ చెప్పడం జరిగింది. మీడియా ద్వారా ప్రభుత్వానికి ఎన్ని సమస్యలు విన్నవించినా, పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తూ.. చాలా చిన్న చూపు చూస్తూ వివో ఏ ల శ్రమను ఎద్దేవా చేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకుని ఉన్న మీడియా కి భిన్నంగా సోషల్ మీడియా ను విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. వీవో ఏ డిమాండ్స్ పై సోషల్ మీడియా ద్వారా విస్తృత పోరాటం కొనసాగిస్తూనే ఉండాలని అన్నారు.