మన్యం న్యూస్,ఇల్లందు టౌన్.. సింగరేణి గ్రౌండ్ నందు నిర్వహించిన జవహర్ ఉపరితల బొగ్గు గని పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మెన్ డీవీ ఇల్లందు పట్టనంలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ కాటిల్ షెడ్ సమస్య, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా ప్రజలకు క్యాటిల్ షెడ్ కొరకు స్థలం సింగరేణి యాజమాన్యం కేటాయించాలని కోరారు. సింగరేణి పుట్టినిల్లు అయిన ఇల్లందులో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. బొగ్గు పుట్టిందే ఇల్లందులో అలాంటి ఇల్లందులో సింగరేణి యాజమాన్యంకి సంబంధించి ఎలాంటి గుర్తులు లేకపోవడం శోచనీయం అని దీనిపై అధికారులు దృష్టి సారించి బోగ్గుట్ట ఔన్నత్యం ఉట్టిపడేలా మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు.అదేవిధంగా ప్రస్తుత మున్సిపాలిటీ 22, 23 వార్డుల సింగరేణి భూములను రెవెన్యూ వారికి అప్పజెప్పాలని, గతంలో పంచాయతీలుగా ఉన్న మున్సిపాలిటీలో విలీనమైన 22 , 23 వార్డులలో సింగరేణి సంస్థ వారి ఆధ్వర్యంలో ఉన్న భూములను రెవెన్యూ వారికి అప్పజెప్పడం వలన అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు రెగ్యులైజేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
జెకె సెంటర్ నుంచి డి బ్లాక్ వరకు రోడ్డును వెడల్పు చేసి డివైడర్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
గతంలో బ్లాస్టింగ్స్ వలన ఇబ్బంది పడ్డ ఆయా వార్డులప్రజల నివాస గృహాలు కొంతమేరకు పగుళ్లు వచ్చాయని అట్టి వాటిని పరిశీలించి నివాస గృహాలకు తగు మరమ్మతులు చేయవలసిందిగా కోరారు.డీఎంఎంటీ, సీఆర్సీసీ నిధులు సింగరేణి పుట్టినిల్లు ఇల్లందుకు పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు ఉపయోగించాలని తెలిపారు. ఇల్లందు పట్టణానికి స్వాగతం పలికేందుకు నాలుగు వైపులా నాలుగు వెల్కమ్ బోర్డులు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇల్లందు పేరును ఇముమడింప చేయాలని కోరారు. సింగరేణి మనుగడ ఇల్లందులో ఉండాలంటే ఓపెన్ కాస్ట్ సాధ్యపడుతుందని ప్రజలందరు సహకరించాలని తెలిపారు. సింగరేణి పుట్టిల్లు నుండి సింగరేణి దూరం చేయవద్దని యాజమాన్యానికి డీవీ విన్నవించారు.