మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 26
మణుగూరు మండలం లోని బాలాజీ నగర్ ఏరియాకు చెందిన సామా శ్రీనివాసరెడ్డి, వాగు మల్లారం గ్రామానికి చెందిన నామ వెంకటేశ్వర్లు సింగరేణి ఉద్యోగులుగా పనిచేసి ఏప్రిల్ 29వ తేదీన పదవి విరమణ కాబోతున్న సందర్భంగా బుధవారం వారి ఇంటికి వెళ్లి వారిని శాలువాలతో ఘనంగా సత్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారికి పుష్పగుచ్చం అందజేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,పదవి విరమణ అనంతరం వారి జీవితం ప్రశాంతంగా, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో జెడ్పీటీసీ పోశం. నర్సింహారావు,పిఏసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు పార్టీ కార్యదర్శులు రామి రెడ్డి, నవీన్,పార్టీ సీనియర్ నాయకులు వట్టం రాంబాబు, యాదగిరి గౌడ్,యువజన నాయకులు సాగర్ యాదవ్, రవి ప్రసాద్,హర్ష నాయుడు, పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.