ఘనంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం*
నియోజకవర్గ ప్లీనరీకి భారీగా హాజరైన కార్యకర్తలు, నేతలు*
బంగారు తెలంగాణ దార్శనికుడు కేసీఆర్*
12 అంశాలపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన నేతలు
L*రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం: ప్లీనరీలో ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్*
మన్యంన్యూస్,ఇల్లందు టౌన్*:ఇల్లందు నియోజకవర్గ బారాస పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేసి పట్టణంలోని ప్రధాన కూడళ్లయిన గవర్నమెంట్ హాస్పిటల్, జగదాంబ సెంటర్, బుగ్గవాగు బ్రిడ్జి, ఆమ్ బజార్ గుండా మార్కెట్ యార్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీలో ముందు కారులో పట్టణ ప్రజలకు అభివాదం తెలుపుతూ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసరా పెన్షన్లు, యాదవులకు గొర్రెల యూనిట్ పంపిణీ, దళిత బంధు, రైతుబంధు, హరితహారం, డబల్ బెడ్ రూములు, మన ఊరు- మనబడి, సిసి రోడ్లు, బిటి రోడ్లు, బ్రిడ్జి వంతెనల నిర్మాణాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, సీతారామ ప్రాజెక్ట్ తదితర అనేక పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపి మిగతా రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా చేసిన మహనీయుడు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే హరిప్రియ కొనియాడారు. ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమ పథకాల అమలుకు కెసిఆర్ ఆశీర్వాదంతో మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతామధు, భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావులు అందించిన సహాయ సహకారాలు మరువలేనివవి ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధిని మునుముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇల్లందులో నిర్మాణంలో ఉన్న కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అయిన బస్ డిపో, మల్టీ యుటిలిటీ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తదితర అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయని ఆమె తెలిపారు. ఇప్పటికే ఇల్లెందు రోడ్లను వెడల్పు చేస్తూ తార్ రోడ్డును వేసామని, సెంట్రల్ లైటింగ్, ఇల్లందులపాడు లేక్ పార్కు, పట్టణ ప్రజలకు టాయిలెట్ నిర్మాణాలు తదితర పనులు ఇల్లందు మున్సిపల్ పాలకవర్గము మరియు కౌన్సిలర్ల సహాయ సహకారాలతో అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. ఢీవీ నేతృత్వంలో ఇల్లందు మున్సిపాలిటీలో అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డులు పొందిందని ఆమె పేర్కొన్నారు. అందుకు విశేష కృషి చేసిన మున్సిపల్ పాలకవర్గానికి ఈ సందర్భంగా హరిప్రియ అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు ఇల్లందు నియోజకవర్గంలో 1612 కోట్ల రూపాయలతో గణనీయమైన అభివృద్ధి పనులు జరిగినట్లు, ఇది ఇల్లందు చరిత్రలోనే గతంలో ఏ రాజకీయ నాయకులు తీసుకురాని నిధులను ప్రభుత్వంతో పోట్లాడి తెచ్చి అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన హరిప్రియ హరిసింగ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంపై బిజెపి ప్రభుత్వం కక్షగట్టి అభివృద్ధి పనులను అడ్డుకుంటుందని ఆమె విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో భీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఫ్యాక్టరీ నిర్మించేందుకు అన్నిరకాల వసతులు ఉన్నప్పటికీ తెలంగాణపై వివక్షతో తీవ్ర అన్యాయం చేస్తోందని భాజపా ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెసెతర పార్టీలను కలుపుకొని బిజెపి మతతత్వ ప్రభుత్వాన్ని దించేందుకు కెసిఆర్ జాతీయంగా కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రతిఇంట్లో కనీసం ఒకరికి అందుతున్నాయని, రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల కుటుంబాల్లో లక్ష కుటుంబాలు కేసీఆర్ సంక్షేమ పథకాలను పొందుతున్నాయి అని వ్యాఖ్యానించారు. ఈ పథకాలు, తెలంగాణలో కేసీఆర్ హయాంలో జరిగిన గణనీయమైన అభివృద్ధి పనులే బారాసాకు ప్రధానబలం అని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకగా హరిప్రియ అభివర్ణించారు. అనంతరం 12 రకాల అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టగా నియోజకవర్గ నేతలు వాటిని బలపరచి ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మహబూబాద్ జెడ్పీ ఛైర్మెన్ బిందు, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డీవీ, వైస్ చైర్మన్ జానీపాషా, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, టీబీజీకేఎస్ ఇల్లందు బ్రాంచి ఉపాధ్యక్షులు రంగనాథ్, పట్టణ పార్టీ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్చూరు వెంకటేశ్వర్లు, సిలివేరి సత్యనారాయణ, ఇల్లందు జడ్పిటిసి ఉమాదేవి, ఇల్లందు మండల పార్టీ పార్టీ అధ్యక్షులు శీలంరమేష్, మండల పార్టీ ఇంచార్జ్ ఎలమద్ధి రవి, తెలంగాణ ఉద్యమకారుడు హరిగోపాల్ శర్మ, మాజీ పట్టణ పార్టీ అధికార ప్రతినిధి పివి కృష్ణారావు, కౌన్సిలర్లు జే కే శ్రీనివాస్, కటకం పద్మావతి, తోటలలిత శారద, చీమల సుజాత, గిన్నారపు రజిత, కడకంచి పద్మ, పాబోలు స్వాతి, శ్యామల మాధవి, ఆజాం, తదితరులు పాల్గొన్నారు.
