UPDATES  

 లచ్చిగూడెం క్రికెట్ టోర్నమెంట్ విజేతగా చిన్ననల్లబెల్లి జట్టు..

లచ్చిగూడెం క్రికెట్ టోర్నమెంట్ విజేతగా చిన్ననల్లబెల్లి జట్టు..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 25::
గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని లచ్చిగూడెం గ్రామ సర్పంచ్ ఇర్పా చంటి  అన్నారు. మండలంలోని లచ్చగూడెం ఎంప్లాయిస్ యూత్ ఆధ్వర్యంలో గత 23 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం రోజు ముగిసాయి. మొత్తం 50 జట్లు తెలపడగా ఫైనల్ పోటీలో కామేష్ లెవెన్ చిన్ననల్లబల్లి జట్టు, నారాయణరావుపేట జట్టు తలపడ్డాయి  ఈ హోరా హోరి పోరులో చిన్న నల్లబెల్లి జట్టు విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన చిన్ననల్లబల్లి  జట్టుకు మొదటి బహుమతి 25000/- రెండవ బహుమతి నారాయణరావుపేట జట్టుకు 15000/- మూడో బహుమతి నడికుడి జట్టుకు 5000/- నాలుగో బహుమతి కె ఎన్ పురం జట్టుకు 3000/- రూపాయలను లచ్చగూడెం గ్రామ ఆదివాసి ఎంప్లాయిస్ చేతుల మీదుగా సీల్డ్ తో పాటు నగదును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు చదువులో రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు చెంచయ్య, వీరస్వామి, శ్రీను, ధర్మ, ఆది, వీరమ్మ, రోశమ్మ, సునీత, రవి, ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు రాజ్ కుమార్, రమేష్,చంటి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !