మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 25::
వివోఎ ల శ్రమను ప్రభుత్వం దోచుకుంటుందని సిఐటియు మండల అధ్యక్షురాలు చిలకమ్మ ఆరోపించారు మంగళవారం సమ్మె 9వ రోజు చేరుకుంది ఈ సమ్మెకు మండల అంగన్వాడి టీచర్లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు 8 సంవత్సరాలైనా వివోఎలా కార్మికుల బతుకులు మారలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం తీర్చే వరకు కొనసాగిస్తామని ప్రతిరోజు చేసే నిరసన కార్యక్రమం లో భాగంగా కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నాగరాజు అంగన్వాడి టీచర్స్ కమలాదేవి గజలక్ష్మి రమ వీవోఏలు కుమారి లక్ష్మి ఝాన్సీ మంగవేణి పద్మ రమాదేవి రాజేష్ దుర్గ తదితరులు పాల్గొన్నారు.