పెండింగులో ఉన్నతునికాకు బోనస్ తక్షణమే విడుద చేయాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా
జిల్లా జేసీకి వినతిపత్రం అందించిన నేతలు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి జిల్లాలో 2016 సంవత్సరం నుంచి 2021 వరకు పెండింగులో ఉన్న సుమారు రూ.100 కోట్ల తునికాకు బోనసును తక్షణమే విడుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా జేసీ వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు పెండింగులో వున్న తునికాకు బోనస్ విడుదల చేసిన ప్రభుత్వం భద్రాద్రి జిల్లాపై వివక్షత చూపడం సరైందికాదని అన్నారు. పూర్తిగా గిరిజనులు నివసించే ఏజెన్సీ గ్రామాలతో మిళితమై వున్నా భద్రాద్రి జిల్లా తునికాకు కార్మికులను విస్మరించడం దారుణమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన, గిరిజనేతర పేదలకు ప్రజలకు రెండోవ పంటగా తునికాకును సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారని, వీరికి రావలసిన ఏడు సంవత్సరాలకు సంబంధించి రూ.100కోట్ల బకాయి బోనస్ బకాయిలు విడుదల రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. బోనసుతోపాటు 50 ఆకుల కట్టకు రూ.5లు చెల్లించాలని, ఆకు సేకరణలో ప్రమాదాల బారినపడి మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తునికాకు కార్మికుల శ్రమకు తగ్గ ప్రతిఫలం తగ్గటం లేదు, వారి శ్రమను కారు చౌకగా కాంట్రాక్టుర్లు దోచుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. సకాలంలో మోడెం కొట్టించాలి.ఉల్టా,పల్టా, లోడింగ్ అన్ లోడింగ్, కళ్ళేదారి కమిషన్ ఇతర పనులకు 30%శాతం ఇవ్వాలి. కల్లాల దగ్గర వైద్య సదుపాయాల కిట్లు, మంచినీటి సౌకర్యాలను కల్పించేవిధంగా జిల్లా అధికార యంత్రంగం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య, జిల్లా సమితి సభ్యులు అక్కి నర్సింహా రావు తదితరులు వున్నారు